ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తన మార్చుకోవాలి

by  |
ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తన మార్చుకోవాలి
X

దిశ, అమరావతి బ్యూరో: బెజవాడ పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్లకు సీఐ ఉమర్ ఆధ్వర్యంలో ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ఉమర్ మాట్లాడుతూ.. రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా పెట్టామన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని తమ ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. ఇకపై ఏదైనా నేరం చేసినా, నేరాలు చేయమని ప్రోత్సహించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రతి వారం పోలీస్ స్టేషన్ లో హాజరు వేయించుకోవడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన వాటిపై పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. లేనిపక్షంలో ఆయా ప్రాంతాల్లో జరిగే నేరాలకు అక్కడున్న రౌడీషీటర్లే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజా జీవనానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కౌన్సెలింగ్ నిర్వహించిన వారిలో 2టౌన్ క్రైమ్ ఎస్సై కృష్ణ, స్టేషన్ సిబ్బంది ఉన్నారు.



Next Story

Most Viewed