ఉద్యోగులను తొలగించిన హెచ్అండ్ఎమ్.!

by  |
ఉద్యోగులను తొలగించిన హెచ్అండ్ఎమ్.!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా అనేక పరిశ్రమల్లో కార్యకలాపాలు పునఃప్రారంభమైనప్పటికీ కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రముఖ రిటైల్ ఫ్యాషన్స్ సంస్థ హెనెస్ అండ్ మారిట్జ్ (హెచ్అండ్ఎమ్) భారత్‌లోని ఉత్పత్తి యూనిట్‎లో ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది. సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా సోర్సింగ్ విభాగానికి సంబంధించి 60 మందిని తొలగిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది.

‘కార్యకలాపాలను నిర్వహించేందుకు తాము డిజిటలైజేషన్ ప్రక్రియను ప్రారంభించాము. మార్కెట్ వృద్ధిని పరిగణలోకి తీసుకుని వినియోగదారులకు అవసరమైన స్థాయిలో మెరుగైన సేవలను అందించేందుకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్టు’ కంపెనీ వెల్లడించింది. సంస్థ పనితీరును వేగవంతం చేస్తూ, సామర్థ్యాన్ని పెంచేందుకు ఇలాంటి నిర్ణయాలు ఎంతో దోహదపడతాయని, ప్రస్తుతం పరిశ్రమలో నెలకొన్న పోటీ మధ్య తమ స్థానం మరింత బలోపేతమవుతుందని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుత ఏడాది కరోనా మహమ్మారి కారణంగా అమ్మకాలు మందగించిన నేపథ్యంలో హెచ్అండ్ఎమ్ సంస్థ తమ వ్యాపారాన్ని సమీక్షిస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఉద్యోగుల తొలగింపుతో పాటు ఖర్చులను తగ్గించే మార్గాలను పరిశీలిస్తున్నట్టు పేర్కొంది. అయితే, భారత్‌లో స్టోర్‌లను మూసివేసే ఆలోచన లేదని, మరింత వృద్ధిని సాధించే ప్రయత్నాలను చేపట్టనున్నట్టు కంపెనీ తెలిపింది.

Next Story

Most Viewed