- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టార్ హీరో మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా కలకలం
మూడేళ్ల క్రితం ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా(Corona Virus) మహామ్మారి మరోసారి చాపకింద నీరులాగా విస్తరిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: మూడేళ్ల క్రితం ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా(Corona Virus) మహామ్మారి మరోసారి చాపకింద నీరులాగా విస్తరిస్తోంది. మరోసారి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఆసియా దేశాలైన హాంగ్‌కాంగ్, సింగపూర్‌లలో గత కొన్ని రోజులుగా కోవిడ్(Covid19) కారణంగా ఆస్పత్రి బాట పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండగా.. తాజాగా ఇండియాకూ పాకింది. టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు(Mahesh Babu) ఫ్యామిలీలో కరోనా కలకలం రేపింది. మహేశ్ బాబు సతీమణి నమ్రతా సోదరి శిల్పా శిరోద్కర్(Shilpa Shirodkar) కరోనా బారిన పడ్డారు. ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు స్వయంగా తానే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇటీవల తనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలని.. జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా మాస్క్(Mask) తప్పనిసరిగా పెట్టుకోవాలని ఆమె సూచనలు చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని మహేశ్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.






