మళ్లీ ముంచుకొస్తున్న కరోనా ముప్పు.. తొమ్మిది నెలల చిన్నారికి పాజిటివ్

by Gantepaka Srikanth |

గత మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి(Corona Virus).. మళ్లీ విస్తరిస్తోంది.

మళ్లీ ముంచుకొస్తున్న కరోనా ముప్పు.. తొమ్మిది నెలల చిన్నారికి పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: గత మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి(Corona Virus).. మళ్లీ విస్తరిస్తోంది. చాపకిందనీరులాగా మెల్లగా వ్యాపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఇప్పటికే కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. తాజాగా భారత్‌లోనూ రోజుకో చోట కేసు నమోదు అవుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా మహిళకు పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమెను రిమ్స్‌లోని ఐసోలేటెడ్ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. తాజాగా బెంగళూరు(Bangalore)లో తొమ్మిది నెలల చిన్నారికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆ చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. కరోనా కేసులు వ్యాప్తి చెందుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ప్రజలకు సూచనలు చేస్తున్నారు. గుంపులుగా గుమిగూడకూడదని.. రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, పబ్లిక్ స్థలాల్లో కొవిడ్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని హెచ్చరిస్తున్నారు.

Next Story