ఆర్మూర్‌లో పరీక్షలు షురూ

by  |
ఆర్మూర్‌లో పరీక్షలు షురూ
X

దిశ,ఆర్మూర్: వైద్య ఆరోగ్య శాఖ కొవిడ్ పరీక్షలను పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా శుక్రవారం ఆర్మూర్ డివిజన్ కేంద్రంలోని పెర్కిట్ లో కొవిడ్-19 కేంద్రాన్ని జిల్లా ఇన్ చార్జ్ వైద్యాధికారి డాక్టర్ రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్. రమేష్ మాట్లాడుతూ ఆర్మూర్ లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్మూర్ లో 5 కొవిడ్ సెoటర్లను పెర్కిట్, మామిడిపల్లి, పాత రామందిర్, మొబైల్ వ్యాన్, ప్రభుత్వ ఆసుపత్రి, సెంటర్లను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, డాక్టర్ అయేషా, సూపర్ వైజర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story