లాలన ఆశ్రమంలో 11 మందికి కరోనా

by  |
లాలన ఆశ్రమంలో 11 మందికి కరోనా
X

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని లాలన ఆశ్రమంలో 11 మందికి కరోన పాజిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్ రమేష్ తెలిపారు. ఈ ఆశ్రమంలో మొత్తం 57 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా, వీరిలో 11 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. దీంతో 8 మంది బాధితులను నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. మిగతా ముగ్గురిని హోమ్ ఐసోలేషన్ ఉంచినట్టు స్పష్టం చేశారు. ఆశ్రమంలో కరోనా కలకలం రేగడంతో స్థానికులు అందరూ ఆందోళన చెందుతున్నారు.

Next Story