కరోనా ఎఫెక్ట్.. ప్రియదర్శి హౌజ్ అరెస్ట్

by  |
కరోనా ఎఫెక్ట్.. ప్రియదర్శి హౌజ్ అరెస్ట్
X

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న యువ కమెడియన్ ప్రియదర్శి తనకు తానే హౌజ్ అరెస్ట్ అయ్యారు. ఇటీవలే ప్రభాస్ సినిమా షూటింగ్ కోసం జార్జియా వెళ్లాడు. ముగించుకొని హైదరాబాద్ వచ్చిన ఆయన కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ప్రియదర్శి శంషాబాద్ విమానాశ్రయంలో కరోనా వైరస్ స్ర్కీనింగ్ అనంతరం ఇంట్లోనే ఉండిపోయారు. తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకునేందుకు బాధ్యతగా 14రోజులు ప్రజలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రియదర్శి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రియదర్శి తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.


Tags: Coronavirus, Comedian Priyadarshi, House Arrest, Georgia, Prabhas Movie Shooting

Next Story