- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇప్పుడు అది పెద్ద సమస్యగా మారింది
<p>దిశ, న్యూస్ బ్యూరో: కరోనా ప్రభావం ప్రజా రవాణాతో పాటు సరుకు రవాణా రంగంపైనా పడింది. ఈ రంగంలో ప్రధాన వాటా కలిగి అతి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న లారీ ట్రాన్స్ పోర్ట్ ప్రధానంగా దెబ్బ తిన్నట్లు తెలుస్తోంది. డీజిల్ ధరలు పెరిగి ఖర్చులు కూడా పెరిగాయని, ప్రభుత్వం పన్ను రద్దుచేసి తమను ఆదుకోవాలని లారీ అసోసియేషన్ నాయకులు కోరుతున్నారు. రాష్ట్రంలో సమారు 2 లక్షల 50 వేల దాకా లారీలు ఉంటాయని రవాణా శాఖ, […]</p>

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా ప్రభావం ప్రజా రవాణాతో పాటు సరుకు రవాణా రంగంపైనా పడింది. ఈ రంగంలో ప్రధాన వాటా కలిగి అతి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న లారీ ట్రాన్స్ పోర్ట్ ప్రధానంగా దెబ్బ తిన్నట్లు తెలుస్తోంది. డీజిల్ ధరలు పెరిగి ఖర్చులు కూడా పెరిగాయని, ప్రభుత్వం పన్ను రద్దుచేసి తమను ఆదుకోవాలని లారీ అసోసియేషన్ నాయకులు కోరుతున్నారు. రాష్ట్రంలో సమారు 2 లక్షల 50 వేల దాకా లారీలు ఉంటాయని రవాణా శాఖ, తెలంగాణ లారీ అసోసియేషన్ లెక్కల ద్వారా తెలుస్తోంది. వీటిలో 25 వేల దాకా లారీలు సరుకు రవాణాకు సంబంధించి నేషనల్ పర్మిట్లు కలిగి ఉంటాయి. రాష్ట్రంలోని లారీలు నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి బొగ్గు, ఇసుక, సిమెంటు, రసాయనాల లాంటి తదితర వస్తువుల దాకా రాష్ట్రం లోపల, పక్క రాష్ట్రాలకు సరఫరా చేస్తుంటాయి. ఈ రంగం మీద ఆధారపడి డ్రైవర్లు, క్లీనర్లే కాక హమాలీ కార్మికులు ఇలా అందరూ కలిపి 10 లక్షల మంది దాకా ఉపాధి పొందుతుంటారు. అయితే మార్చి 22 నుంచి నెలన్నర పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను ప్రభుత్వం అమలు చేసింది. ఈ లాక్‌డౌన్ కాలంలో నిత్యావసర వస్తువుల రవాణాకుగాను అడపాదడపా తిరిగినవి తప్ప లారీలు దాదాపు రోడ్డెక్కలేదు. లాక్‌డౌన్‌కు దశలవారీగా సడలింపులు ఇచ్చిన తర్వాత కూడా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడిన పడకపోవడంతో రాష్ట్రంలో లారీలకు కరోనాకు ముందు సాధారణ పరిస్థితుల్లో ఉన్న గిరాకీతో పోలిస్తే ప్రస్తుతం 40 శాతం దాకా వ్యాపారం పడిపోయినట్లు తెలుస్తోంది.
పనిలోకొచ్చే పరిస్థితి లేదు..
రవాణా డిమాండ్ పడిపోవడం ఒక సమస్య అయితే తగినంత లేబర్ అందుబాటులో లేకపోవడం సరుకు రవాణా రంగం నెమ్మదించగడానికి మరో పెద్ద సమస్యగా మారిందని తెలంగాణ లారీ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. వర్షాకాలం ముగిసి నిర్మాణ రంగం పూర్తిస్థాయిలో ఊపందుకున్న తర్వాతే సొంత రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికులు ఎక్కువ మంది తిరిగి వస్తారని, అప్పుడే సరుకు రవాణా రంగానికి కూడా మంచి రోజులు వస్తాయంటున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం 60 శాతం వ్యాపారమే ఉన్నప్పటికీ ఆ స్థాయిలో లారీలు రోడ్డెక్కడానికి కావాల్సిన స్థాయిలో డ్రైవర్లు, క్లీనర్లు అందుబాటులో లేరని వారు చెబుతున్నారు. లారీల్లో వేరే ప్రాంతాలకు వెళ్లాలంటే టీ, టిఫిన్‌లకు రోడ్డుపై నడిపే హోటళ్లను ఆశ్రయించాల్సి వస్తుందని, ఈ క్రమంలో ఎక్కడ కరోనా అంటుతుందో అన్న భయంతో చాలా మంది విధుల్లోకి రావడం లేదని లారీల యజమానులు వాపోతున్నారు.
ఖర్చులు పెరిగినయ్.. పన్ను రద్దు చేయండి..
కరోనా ప్రభావంతో నెలకొన్న ప్రస్తుత గడ్డు పరిస్థితులకు తోడు పెట్రోలుతో సమానంగా పెరుగుతున్న డీజిల్ రేట్లతో తమ పరిస్థితి మరీ దయనీయంగా మారిందని, బిజినెస్ తక్కువ.. ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయని తెలంగాణ లారీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దుర్గా ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా రవాణాలో ఉన్నట్లుగా సరుకు రవాణాకు కూడా కనీస చార్జీలు నిర్ణయించాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఇటీవల రాష్ట్రాలకు లేఖ రాసిందని, వాస్తవానికి అది ఆచరణ సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. తమ పరిస్థితి అర్థం చేసుకొని జూన్ త్రైమాసికానికి రోడ్డు పన్నును రద్దు చేసి సెప్టెంబర్ త్రైమాసికానికి రోడ్డు పన్ను చెల్లింపు తేదీని సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.






