గ్రేటర్ అభివృద్ధిపై కరోనా ఎఫెక్ట్​

by Shyam |

<p>దిశ, న్యూస్​ బ్యూరో: కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రభావం అన్ని వ్యవస్థలపైనా పడుతోంది. అయితే, గ్రేటర్‌లో రానున్నది ఎన్నికల కాలం. ఎనిమిది నెలల్లో గ్రేటర్​ ఎలక్షన్స్​లో గెలిచేందుకు అధికార పార్టీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు నగరం నలుమూలలా పలు కీలక ప్రాజెక్టులు చేపట్టారు. అయితే, కరోనా నేపథ్యంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. గ్రేటర్​ హైదరాబాద్​లో పేదలకు ఇండ్లు కట్టించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు డబుల్​ బెడ్​ రూం పథకాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తామని ఇటీవలే [&hellip;]</p>

గ్రేటర్ అభివృద్ధిపై కరోనా ఎఫెక్ట్​
X

దిశ, న్యూస్​ బ్యూరో: కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రభావం అన్ని వ్యవస్థలపైనా పడుతోంది. అయితే, గ్రేటర్‌లో రానున్నది ఎన్నికల కాలం. ఎనిమిది నెలల్లో గ్రేటర్​ ఎలక్షన్స్​లో గెలిచేందుకు అధికార పార్టీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు నగరం నలుమూలలా పలు కీలక ప్రాజెక్టులు చేపట్టారు. అయితే, కరోనా నేపథ్యంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. గ్రేటర్​ హైదరాబాద్​లో పేదలకు ఇండ్లు కట్టించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు డబుల్​ బెడ్​ రూం పథకాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తామని ఇటీవలే మంత్రులు ప్రకటించారు. తెల్లాపూర్​లో తప్ప మిగిలిన చోట్లలో ఈ ఇండ్లు అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో మూడు, నాలుగు చోట్ల ప్రారంభించి బల్దియా ఎన్నికలకు వెళ్లాలని టీఆర్​ఎస్​ భావిస్తోంది. సిటీలో 1,500 టాయిలెట్లను మూడు నెలల్లో అందుబాటులోకి తెస్తామని బల్దియా పాలక యంత్రాంగం ప్రకటించింది. కానీ, ఇవేవీ ఇప్పట్లో ప్రారంభం కావడం లేదు. కరోనాతో అన్ని వాయిదా పడ్డాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో ప్రథమ ప్రాధాన్యతలో ఉన్న ఎస్​ఆర్​డీపీ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న ఫ్లైఓవర్లు, అండర్​ పాస్​ల నిర్మాణాలు సగానికిపైగానే పూర్తి చేయాల్సి ఉంది. రోడ్ల విస్తరణ పనులు, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాల కోసం శంకుస్థాపన కార్యక్రమాలూ నిలిచిపోయాయి.

ఎన్నికల భయం..!

జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ ఆధ్వర్యంలో తాగునీటి సరఫరా, డ్రైనేజీల పునరుద్ధరణ పనులపైనా కరోనా ప్రభావం పడుతోంది. నగరంలో చేపట్టదలిచినా ఫుట్​పాత్​ల నిర్మాణాలు కూడా ఆగిపోతున్నాయి. అయితే, అధికార పార్టీ నాయకులకు కరోనాతో పాటు గ్రేటర్​ ఎన్నికల భయం కూడా పట్టుకున్నట్టు తెలుస్తోంది. నాలాల విస్తరణకు ప్రభుత్వం రూ.200 కోట్లను మంజూరు చేసినా.. శంకుస్థాపనలను కరోనా అడ్డుకోవడంతో ఆ పనులు వాయిదా పడుతున్నాయి. పార్కుల, స్పోర్ట్స్​ కాంప్లెక్స్​ అభివృద్ధి చేయాలని బల్దియా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ, ఉన్నవాటికే తాళాలు వేసే పరిస్థితి వచ్చింది. బస్​ షెల్టర్టు, జంక్షన్లు అభివృద్ధి తదితర కార్యక్రమాలన్నీ కరోనా వైరస్​ ప్రభావంతో వాయిదా పడ్డాయి.

Tags:GHMC elections, coronavirus, openings

Next Story