మరో నాలుగు వారాల్లో తెలంగాణలో అదుపులోకి కరోనా.. శ్రీనివాస రావు

by  |
మరో నాలుగు వారాల్లో తెలంగాణలో అదుపులోకి కరోనా.. శ్రీనివాస రావు
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడారు. ఎవరైనా సరే.. తమలో కరోనా లక్షణాలు కనిపిస్తేనే టెస్టులు చేయించుకోవాలని కోరారు. తెలంగాణలో కరోనా అదుపులోకి రావాలంటే మరో నాలుగు వారాల సమయం పడుతుందని తెలిపారు. ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనాపై విజయం సాధించవచ్చని అన్నారు. కరోనా విషయంలో ఇప్పటి వరకు తీసుకున్న జాగ్రత్తల కంటే మరింత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. కరోనా నేపథ్యంలో ప్రజలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం అప్రమత్తం చేస్తున్నదని తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు 45 లక్షలకు పైగా ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నారని అన్నారు.

Next Story