- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో మరోసారి పెరిగిన కరోనా కేసులు..
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మరోసారి కరోనా కేసులు పెరిగాయి. ఇవాళ ప్రభుత్వం కొవిడ్-19 టెస్టుల సంఖ్యను పెంచడంతో ఈ మేరకు కేసులు వెల్లడయ్యాయని తెలుస్తోంది. గడచిన 24 గంటల వ్యవధిలో తాజాగా 10,830 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 81మంది వైరస్ బారిన పడి మృతిచెందారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి, ఇప్పటివరకు తేలిన మొత్తం కేసుల సంఖ్య 3,82,469కు చేరింది. అలాగే తాజా మరణాలతో కలిపి, ఇప్పటివరకు వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మరోసారి కరోనా కేసులు పెరిగాయి. ఇవాళ ప్రభుత్వం కొవిడ్-19 టెస్టుల సంఖ్యను పెంచడంతో ఈ మేరకు కేసులు వెల్లడయ్యాయని తెలుస్తోంది. గడచిన 24 గంటల వ్యవధిలో తాజాగా 10,830 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 81మంది వైరస్ బారిన పడి మృతిచెందారు.
కొత్తగా నమోదైన కేసులతో కలిపి, ఇప్పటివరకు తేలిన మొత్తం కేసుల సంఖ్య 3,82,469కు చేరింది. అలాగే తాజా మరణాలతో కలిపి, ఇప్పటివరకు వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,541కు చేరుకుంది. కాగా, చికిత్స అనంతరం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,86,720కు చేరుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 92,208 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
Next Story






