ఒంగోలులో కరోనా డేంజర్ బెల్స్

by  |
ఒంగోలులో కరోనా డేంజర్ బెల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఒంగోలులో కరోనా రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే 30 వరకు కరోనా కేసులు నమోదుకాగా, తాజాగా వార్డు సచివాలయాల కార్యదర్శులు, వార్డు వలంటీర్లు, పారిశుధ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలకు నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ అని తేలింది. బాలాజీ నగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో ఒక వార్డు సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తున్న ఒక మహిళకు, పాపా కాలనీ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో మహిళా వార్డు వలంటీర్‌కు కరోనా అనుమానిత లక్షణాలు కనిపించాయి. వీరిలో మహిళా పోలీసును రిమ్స్‌లోని ఐసోలేషన్‌కు తరలించగా, మహిళా వార్డు వలంటీర్‌ మాత్రం తాను ఇంట్లోనే ఉంటానని పట్టుబట్టడంతో ఆమెను హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచారు.

కాగా జిల్లాలో కోవిడ్‌ 19 పాజిటివ్‌ కేసులు 56కు చేరుకున్నాయి. ఆదివారం జిల్లాలో మూడు కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో గుడ్లూరులో మూడు, ఒంగోలు ఇస్లాంపేటలో ఒకటి నమోదైంది. దీంతో వీరికి దగ్గరగా ఉన్న వారిని జీజీహెచ్‌ క్వారంటైన్‌కు తరలించారు. వీరు ఎవరెవరిని కలిశారు అనే విషయంపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. వైద్య పరీక్షలను వేగంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో 7 యంత్రాలను జిల్లాకు మంజూరు చేసింది.

Tags – covid, corona, AP, Ongole, positive, ward member

Next Story

Most Viewed