షారుఖ్ ఖాన్ అభిమానులకు గుడ్ న్యూస్!.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన బాలీవుడ్ బాద్ షా..

by Kavitha |
షారుఖ్ ఖాన్ అభిమానులకు గుడ్ న్యూస్!.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన బాలీవుడ్ బాద్ షా..
X

దిశ, సినిమా: తాజాగా షారుఖ్ ఖాన్ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అస్వస్థతకు గురై అహ్మదాబాద్ లోని KD హాస్పిటల్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే..

అయితే తాజాగా నేడు ఉదయం షారుఖ్ అహ్మదాబాద్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న వడదెబ్బ నుంచి కోలుకోవడానికి చికిత్స తీసుకున్న షారుఖ్ కోలుకోవడంతో నేడు ఉదయం డిశ్చార్జ్ అయి ముంబైకి బయలుదేరినట్టు సమాచారం. ఇక షారుఖ్ ని కలవడానికి ఆ మ్యాచ్ కి వచ్చిన షారుఖ్ ఫ్యామిలీతో పాటు పలువురు ప్రముఖులు హాస్పిటల్ కి వెళ్లారు. అలాగే షారుఖ్ హాస్పిటల్ లో చేరాడని తెలియడంతో పలువురు అభిమానులు ఆ హాస్పిటల్ బయట గుమిగూడారు.

కాగా ఇటీవల జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ఐపీఎల్ పైనే మొత్తం ఫోకస్ పెట్టారు అనే విషయం తెలిసిందే.

Next Story

Most Viewed