అల్లు అర్జున్‌తో రెండో వదిన.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయిన షాకింగ్ న్యూస్

by Sujitha |
Tripti Dimri
X

దిశ, సినిమా : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’తో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. తగ్గేదేలే అంటూ నార్త్‌లో కూడా బాలీవుడ్ హీరోలను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. బన్నీ డ్యాన్స్‌కు ఇప్పటికే ఫిదా అయిపోయిన జనాలు.. ఈ సినిమా పాటలను లూప్‌లో చూశారంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా అల్లు అర్జున్, సమంత కాంబినేషన్‌లో వచ్చిన ‘ఊ అంటావా మావా’ సాంగ్‌కు స్పెషల్ అప్లాజ్ దక్కింది. అయితే అలాంటి పాటే పార్ట్ 2లోనూ ఉండబోతుందని తెలుస్తుంది. ఇందుకు ‘యానిమల్’ సినిమా హీరోయిన్, బాబీ 2(రెండో వదిన)గా ఫేమస్ అయిన బ్యూటిఫుల్ త్రిప్తి దిమ్రిని సెలెక్ట్ చేశారని టాక్.

సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు ఇప్పటికే ఈ నేషనల్ క్రష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలో సాంగ్ షూటింగ్ జరగబోతోందని సమాచారం. కాగా మాకు కావాల్సింది ఇదే అంటున్నారు కుర్రాళ్లు. పాట ఊరమాస్‌గా ప్లాన్ చేయాలని మూవీ యూనిట్‌ను కోరుతున్నారు. ఇక త్రిప్తి ఈ ప్రాజెక్ట్‌తో పాటు బాలీవుడ్‌లో మరో మూడు సినిమాలు లైన్‌లో పెట్టేసింది. మొత్తానికి ‘యానిమల్’ సక్సెస్‌తో చాలా బిజీ అయిపోయింది భామ.

Next Story

Most Viewed