ఆదివారం స్పెషల్.. కొత్తిమీర చికెన్ రోస్ట్

572

దిశ, వెబ్‌డెస్క్ : ఆదివారం వస్తే చాలు అందిరి ఇటిలో చికెన్ ఉంటుంది. ఇక చికెన్ ప్రియులయితే అమ్మ ఎప్పుడెప్పుడు చికెన్ వండుతుందా.. ఎప్పుడు తిందామా అన్నట్టు చూస్తారు. ఇప్పుడు ఆ చికెన్ ప్రియుల కోసమే కొత్తిమీర చికెన్ రోస్ట్… ఆదివారం ఇంటిలో కొత్తగా ట్రై చేయండి అందరి నుంచి మన్నలను పొందండి. ఇంకెందుకు లేటు కొత్తిమీర చికెన్ రోస్ట్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థలు..

  • చికెన్ 500 గ్రా
  • కారం పొడి – 1 టేబుల్ స్పూన్
  • గరం మసాలా – 1 టేబుల్ స్పూన్
  • పసుపు పొడి – 1/4 స్పూన్
  • ఉప్పు – రుచికి
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
  • కొత్తిమీర – 3/4 కప్పు (మెత్తగా తరిగినవి)
  • ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం..

ఓ గిన్నెలో చికెన్ తీసుకుని దానికి సరిపడ కారం, పసుపు, గరం మసాలా, పసుపు పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తి మీరా వేసి వాటిని పీసుకు పట్టేలా బాగా కలపాలి. కలిపిన చికెన్‌ను ఒక గంట సేపు పక్కకు పెట్టుకోవాలి. తరువాత స్టౌవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె పోయాలి. నూనె కొంచెం మరిగిన తరువాత మనం పక్కకు పెట్టుకున్న చికెన్‌ను పాన్‌లో వేసి ఉడికించాలి. ఆ సమయంలో కొంచెం గ్యాస్ తగ్గించుకోవాలి… అంటే తక్కువ వేడి మీద ఉడికించాలి. చికెన్ ఉడుకుతున్నప్పుడు మద్యమద్యలో కలుపుతూ ఉండి. అందువలన చికెన్ నిరాధారంగా ఉంటుంది. చికెన్ బాగా ఉడికినట్లయితే, స్టవ్ ఆపివేసి క్రిందికి దింపి. ఇప్పుడు రుచికరమైన కొత్తిమీర చికెన్ రోస్ట్ రేడీ.. ఇంకేం వేడి వేడి చికెన్ రోస్ట్ తినేయ్యండి