- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా ఎస్సైపై కానిస్టేబుల్ అత్యాచారం..
<p>దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి పేరుతో సహచర ఎస్సై ర్యాంక్ మహిళా అధికారిపై ఓ కానిస్టేబుల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తీరా పెళ్లిచేసుకోమని గట్టిగా అడిగే సరికి ప్లేట్ ఫిరాయించాడు. దీంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని రాంగఢ్ జిల్లాలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. వివరాల్లోకివెళితే.. ఝార్ఖండ్ రాజధాని రాంచీకి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండు పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై ర్యాంక్ మహిళా అధికారి, కానిస్టేబుల్ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నట్లు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి పేరుతో సహచర ఎస్సై ర్యాంక్ మహిళా అధికారిపై ఓ కానిస్టేబుల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తీరా పెళ్లిచేసుకోమని గట్టిగా అడిగే సరికి ప్లేట్ ఫిరాయించాడు. దీంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని రాంగఢ్ జిల్లాలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకివచ్చింది.
వివరాల్లోకివెళితే.. ఝార్ఖండ్ రాజధాని రాంచీకి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండు పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై ర్యాంక్ మహిళా అధికారి, కానిస్టేబుల్ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నట్లు ఎస్పీ ప్రభాత్ కుమార్ వెల్లడించారు. తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడమే కాకుండా, మరో మహిళను ఆ కానిస్టేబుల్ పెళ్లాడినట్టు బాధిత ఎస్సై ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్పీ తెలిపారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ప్రభాత్ కుమార్ స్పష్టంచేశారు.






