జర్నలిస్టు దారుణహత్య.. ఆ పని చేసాడని కానిస్టేబుల్ నడిరోడ్డుపై

by  |
జర్నలిస్టు దారుణహత్య.. ఆ పని చేసాడని కానిస్టేబుల్ నడిరోడ్డుపై
X

దిశ, వెబ్‌డెస్క్: తమ అక్రమాలకు, దురాగతాలకు వెలికి తీస్తున్నాడనే అక్కసుతో స్థానికంగా అరాచకాలను సృష్టిస్తున్న ఓ గుట్కా మాఫియా.. జర్నలిస్టును అత్యంత కిరాకతంగా హత్య చేసింది. ఏదైనా దాని మీద వారి నీడ ఉండాల్సిందే. ప్రజలకు ఇదేం దారుణం అని అడిగే ధైర్యం లేదు. ఇంకేం ఆ దుండగుల ఆగడాలకు అంతే లేదు. కానీ ఒక జర్నలిస్టు వారి అక్రమాలను వెలికితీశాడు. ఆ ముఠా సాగిస్తున్న అక్రమ కార్యకలాపాలన్నింటికీ రుజువులు తీసుకొచ్చి టీవీలో ప్రసారం చేయించాడు. కానీ ఆ తెగువే అతడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. అసలేం జరిగింది..?

వివరాలలోకి వెళితే… కర్నూలు జిల్లాలో జర్నలిస్టు దారుణ హత్యకు గురవడం సంచలనంగా మారింది. నంద్యాలలో ఓ యూట్యూబ్ ఛానల్‌లో కేశవ జర్నలిస్ట్ గా పని చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు నిజాలను బయటపెట్టే కేశవ ఇటీవల నంద్యాలకు చెందిన కానిస్టేబుల్ సుబ్బయ్య దురాగతాలపై తన యూట్యూబ్ చానల్ లో వార్త రాశాడు. దీని ఆధారంగానే కానిస్టేబుల్ సుబ్బయ్యను ఎస్పీ సస్పెండ్ చేశారు. దీంతో కేశవ వలనే తనను సస్పెండ్ చేశారని కానిస్టేబుల్ కక్ష పెంచుకున్నాడు.

ఇందులో భాగంగానే ఎన్జీవో కాలనీలో ఈ విషయమై మాట్లాడానికి రమ్మని కేశవ ను పిలిచి.. అతను హాస్టల్ దగ్గర ఉండగా కానిస్టేబుల్ సుబ్బయ్య అతని సోదరుడు నాని ఇద్దరు బైక్ పై వచ్చి స్క్రూ డ్రైవర్ తో కడుపులో పొడిచి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న జర్నలిస్ట్ ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స అందేలోపే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి పరిశీలించారు. రిపోర్టర్ కేశవ్ ను హత్య చేసింది సస్పెండ్ అయిన కానిస్టేబుల్ అతని తమ్ముడు కలిసి హత్యచేశారని నిర్దారణ అయ్యిందని, వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. ఏ ఒక్క జర్నలిస్ట్ కు ఆపద, అపాయం వచ్చిన తాము ఉన్నామని, త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసి కఠిన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు.



Next Story

Most Viewed