కాంగ్రెస్ ర్యాలీ ప్రారంభం.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by  |
కాంగ్రెస్ ర్యాలీ ప్రారంభం.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ర్యాలీ ప్రారంభమైంది. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ నుంచి వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయం వరకు జరగనున్న భారీ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితర టీ-కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ క్రమంలో డప్పు చప్పుళ్లతో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక నినాదాలతో ‘క‌ర్షకుడా.. క‌దిలిరా’ అంటూ ర్యాలీ మొదలుపెట్టారు. రైతులు పండించిన పంట‌ను కేంద్రం కొన‌లేమ‌ని చెప్పడానికి ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణం అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వ‌రి ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసి రైతుల‌కు న్యాయం చేయాల‌ని ఆయన డిమాండ్ చేశారు. రైతుల కోసం చేసే పోరాటంలో కాంగ్రెస్ ఎప్పుడు ముందంజ‌లో ఉంటుంద‌న్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ‌నాట‌కాలు ఆడుతున్నాయ‌ని భట్టి, ఉత్తమ్ విమర్శించారు.

Next Story

Most Viewed