- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వడ్లు ఎందుకు కొనరు.. వాళ్ల కోసం పోరాటం చేస్తాం..
<p>దిశ వేంసూర్: వేంసూర్ లో కాంగ్రెస్ పార్టీ వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించింది. ఈ సందర్భంగా వేంసూర్ మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తానని చెప్తున్నా, అధికారులు కాంటా ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. రైతు ఉసురు తగిలిన ప్రభుత్వం ఎప్పుడు మనుగడ సాధించలేదని అన్నారు. రైతులకు వేంసూరు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వడ్లు కొనేవరకు రైతులకోసం పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మంజిల్లా సీనియర్ నాయకులు, […]</p>

X
దిశ వేంసూర్: వేంసూర్ లో కాంగ్రెస్ పార్టీ వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించింది. ఈ సందర్భంగా వేంసూర్ మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తానని చెప్తున్నా, అధికారులు కాంటా ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. రైతు ఉసురు తగిలిన ప్రభుత్వం ఎప్పుడు మనుగడ సాధించలేదని అన్నారు. రైతులకు వేంసూరు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వడ్లు కొనేవరకు రైతులకోసం పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మంజిల్లా సీనియర్ నాయకులు, కందుకూరు సొసైటీ డైరెక్టర్ పుచ్చకాయల సోమిరెడ్డి, వేంసూరు మండలాధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, MPTC మందపాటి రాఘవరెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.
Next Story






