కేసీఆర్ ప్రకటన ఎఫెక్ట్.. మంత్రి గంగులకు షాక్

by  |
geeta-bavan
X

దిశ, కరీంనగర్ సిటీ : కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధును పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలన్నా, పేద ప్రజలకు బర్లు, గొర్లు అందజేయాలన్నా, రహదారులకు నిధులు మంజూరు కావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా.. మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కమలాకర్ వెంటనే రాజీనామా చేయాలని నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలంగాణలో ఉపఎన్నికలు జరుగుతున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే అభివృద్ధి నిధుల వరద పారుతుందని, మిగతా సెగ్మెంట్లను పట్టించుకోవటం లేదంటూ నగరంలోని గీత భవన్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గంటకు పైగా ప్లకార్డులు, ఫ్లెక్సీలు చేతపట్టి ఇందిరాగాంధీ విగ్రహం ఎదుట బైఠాయించారు.

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ నేతల వద్ద ప్రాముఖ్యత లభించాలన్నా.. సెకండ్ కేటగిరీ క్యాడర్‌కు అధినేత వద్ద గుర్తింపు లభించాలన్నా.. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి అంజన్ కుమార్, కాంగ్రెస్ రాష్ట్ర నేత గడ్డం విలాస్ రెడ్డి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి రవి పాల్గొన్నారు.

Next Story

Most Viewed