- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బూతులు తిట్టుకున్న కాంగ్రెస్ నేతలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు తారా స్థాయికి చేరాయి. తాజాగా మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశంలో రభస చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్, టి.నిరంజన్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎన్నికల విషయమై నియోజకవర్గ పరిధిలో ఏం ప్లాన్ చేశారో చెప్పాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతలను కోరారు. ఈ క్రమంలోనే దాసోజు శ్రవణ్, నిరంజన్ మధ్య వాగ్వాదం మొదలైంది. పీసీసీ ఏం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు తారా స్థాయికి చేరాయి. తాజాగా మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశంలో రభస చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్, టి.నిరంజన్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎన్నికల విషయమై నియోజకవర్గ పరిధిలో ఏం ప్లాన్ చేశారో చెప్పాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతలను కోరారు.
ఈ క్రమంలోనే దాసోజు శ్రవణ్, నిరంజన్ మధ్య వాగ్వాదం మొదలైంది. పీసీసీ ఏం చెబుతుందో వినాలంటూ దాసోజు శ్రవణ్‌కు నిరంజన్ చెప్పడంతో గొడవ మొదలైంది. మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావంటూ దాసోజు శ్రవణ్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి, బూతులు తిట్టుకున్నారు. పార్టీలో పద్ధతి, ప్రోటోకాల్ లేదంటూ మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
Next Story






