ఢిల్లీని తాకిన విశాఖ ఉక్కు ఉద్యమం

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ప్రస్తుతం విశాఖ ఉక్కు ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుండగా.. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు దీనిపై పోరాటం చేస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వగా.. ఇప్పటివరకు ఏపీలో మాత్రమే నిరసనలు జరిగాయి. అయితే ప్రస్తుతం ఈ ఆందోళనలు ఢిల్లీని కూడా తాకాయి. విశాఖ ఉక్కు అంశంపై ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద కాంగ్రెస్ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ [&hellip;]</p>

ఢిల్లీని తాకిన విశాఖ ఉక్కు ఉద్యమం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ప్రస్తుతం విశాఖ ఉక్కు ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుండగా.. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు దీనిపై పోరాటం చేస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వగా.. ఇప్పటివరకు ఏపీలో మాత్రమే నిరసనలు జరిగాయి. అయితే ప్రస్తుతం ఈ ఆందోళనలు ఢిల్లీని కూడా తాకాయి. విశాఖ ఉక్కు అంశంపై ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద కాంగ్రెస్ నిరసన ప్రదర్శన నిర్వహించింది.

ఈ ధర్నాలో పలువురు ఏపీ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్.. ప్రత్యేక హోదా, ప్యాకేజీపై సీఎం జగన్ మౌనమెందుకని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టుకోవాల్సిన బాధ్యత సీఎం జగన్‌కు లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం అడుగడుగునా అన్యాయం చేస్తోందని శైలజానాథ్ తెలిపారు.

Next Story