- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్వాల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
<p>దిశ, హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలోని అల్వాల్ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ క్లస్టర్‌గా గుర్తించినందున మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలానగర్ డీసీపీ పద్మజా రెడ్డి, జీహెచ్ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మమత, మల్కాజిగిరి ఆర్డీవో మల్లయ్య, అల్వాల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ తిప్పర్తి యాదయ్య కలెక్టర్‌కు స్థానిక పరిస్థితులను వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అల్వాల్ ఏరియాలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనందున కంటైన్‌మెంట్ జోన్‌గా […]</p>

దిశ, హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలోని అల్వాల్ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ క్లస్టర్‌గా గుర్తించినందున మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలానగర్ డీసీపీ పద్మజా రెడ్డి, జీహెచ్ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మమత, మల్కాజిగిరి ఆర్డీవో మల్లయ్య, అల్వాల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ తిప్పర్తి యాదయ్య కలెక్టర్‌కు స్థానిక పరిస్థితులను వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అల్వాల్ ఏరియాలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనందున కంటైన్‌మెంట్ జోన్‌గా గుర్తించినట్టు తెలిపారు. ఇక్కడి ప్రజలెవరూ బయటకు రాకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ పరిధిలోని ప్రజలకు మందులు, నిత్యావసర సరుకులు వారి ఇళ్ళకే పంపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిరంతరం వైద్య సిబ్బంది, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, హైడ్రోక్లోరిన్, బ్లీచింగ్ పౌడర్‌ను చల్లాలన్నారు.
Tags : corona virus, alwal containment, medchal, collector, tipparthi yadaiah






