ఉద్యోగులకు షాక్.. ఆ నిధి పేరిట జీతాల్లో కోతలు..

by  |
ఉద్యోగులకు షాక్.. ఆ నిధి పేరిట జీతాల్లో కోతలు..
X

దిశ, డైనమిక్ బ్యూరో : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. తెలంగాణకు హరితహారం మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు హరిత నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. దీనికోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల జీతాల నుంచి నెలకు 500 రూపాయలు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల జీతాల నుంచి ప్రతీ నెలా 100 రూపాయలు, ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి నుంచి నెలకు 25 రూపాయలు విరాళంగా తీసుకున్నట్లు సీఎం తెలిపారు. దీనితో పాటు రిజిస్ట్రేషన్లు, భవనాల అనుమతులు, వాహన రిజిస్ట్రేషన్ల సమయంలో కొంత వసూలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు. దీనితో పాటు విద్యార్థుల అడ్మిషన్ల సమయంలో ఒక్కొక్కరికి ఐదు రూపాయలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వొచ్చని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed