ఏపీ అసెంబ్లీలో బూతులు.. ఏం పీకుతావ్!

by  |
ఏపీ అసెంబ్లీలో బూతులు.. ఏం పీకుతావ్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం వాడీవేడిగా ప్రారంభం అయ్యాయి. ముందుగా వ్యవసాయరంగానికి సంబంధించిన వివరాలను మంత్రి కన్నబాబు సభకు వివరించారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి స్పీకర్‌ అవకాశం ఇచ్చారు. నిమ్మల ప్రసంగం మొదలు పెట్టకముందే మరో టీడీపీ పయ్యావుల కేశవ్‌ అడ్డుపడ్డారు. దీంతో సీఎం జగన్‌ జోక్యం చేసుకుని వివరణ ఇచ్చారు. టీడీపీ సభ్యులు అవగాహన లేకండా మాట్లాడడం సమంజసం కాదని అన్నారు. ఆ తర్వాత కూడా టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. పంటనష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అంతేగాకుండా రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయిందంటూ టీడీపీ సభ్యులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అధికార పక్షంవైపు వేలు చూపిస్తూ చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో టీడీపీ సభ్యులు అరుపులు, కేకలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.

అనంతరం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… టీడీపీ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులు కళ్లు పెద్దవి చేస్తూ బెదిరింపులకు గరిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ నెలాఖరు నాటికి ఇన్‌పుట్ సబ్సిడి అందిస్తామని హామీ ఇచ్చారు. నెలరోజుల్లోనే ఇన్‌పుట్ సబ్సిడి అందించే కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. టీడీపీ సభ్యుడు లేవనెత్తిన అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందని అన్నారు. అయినా వినకుండా మళ్లీ అదే అంశంపై మాట్లాడటం సమంజసం కాదని వెల్లడించారు. కర్నూలు ఎమ్మెల్యే తన నియోజకవర్గ పర్యటనకు వెళ్తే, స్థానిక టీడీపీ సీనియర్ నేత ఏం పీకుతావ్ అంటూ సదరు ఎమ్మెల్యేను సంబోధించాడని, ఇది సరైన పద్దతి కాదని సీఎం జగన్ కూడా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తమరు ఏం చేయలేరని, మీ బెదిరింపులకు భయపడేది లేదని అన్నారు.



Next Story

Most Viewed