- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజామాబాద్‌కు సీఎం కేసీఆర్..?
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పర్యటనకు రానున్నట్లు సమాచారం. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖను తన వద్ద ఉంచుకున్న ముఖ్యమంత్రి.. ఇందులో భాగంగానే వరంగల్ ఎంజీఎం, సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. ఇదే క్రమంలో ఈ నెల 27న నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ పర్యటన ఖరారు అయినట్లు విశ్వసనీయ సమాచారం. సీఎం జిల్లాకు వస్తున్నారని తెలియగానే.. హుటాహుటిన జీజీహెచ్ చేరుకొని ఏర్పాట్లకు కూడా పరిశీలించారు. అయినా, జిల్లా అధికార […]</p>

దిశ ప్రతినిధి, నిజామాబాద్: సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పర్యటనకు రానున్నట్లు సమాచారం. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖను తన వద్ద ఉంచుకున్న ముఖ్యమంత్రి.. ఇందులో భాగంగానే వరంగల్ ఎంజీఎం, సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. ఇదే క్రమంలో ఈ నెల 27న నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ పర్యటన ఖరారు అయినట్లు విశ్వసనీయ సమాచారం. సీఎం జిల్లాకు వస్తున్నారని తెలియగానే.. హుటాహుటిన జీజీహెచ్ చేరుకొని ఏర్పాట్లకు కూడా పరిశీలించారు. అయినా, జిల్లా అధికార యంత్రాంగం మాత్రం సీఎం పర్యటనకు గోప్యంగా ఉంచడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే గతంలో మాదిరిగా సీఎం పర్యటన జరుగుతుందా? వాయిదా పడుతుందా? అన్న సందేహం నెలకొంది. ఒకవేళ 27వ రోజే కేసీఆర్ పర్యటన ఖరారు అయితే, బుధవారం రోజే అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తారని టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాలంటే రేపటివరకు వేచిచూడాల్సిందే.






