కేంద్రాన్ని రూ.1350కోట్లు అడిగితే 13పైసలివ్వలేదు!

by  |
కేంద్రాన్ని రూ.1350కోట్లు అడిగితే 13పైసలివ్వలేదు!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో వరదలు రాని చోటు లేదని ఎల్బీస్టేడియంలో నిర్వహిస్తున్న టీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వరదల్లో నష్టపోయిన ప్రజలు దరఖాస్తు చేసుకోకపోయిన ముందుగానే తాము వరద సాయం అందించామనిఅన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో తమ లాగా ఎక్కడైనా చేశారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ వరదల్లో రాష్ట్ర మంత్రులు తలసాని, కేటీఆర్, పద్మారావు తదితరులు మోకాల్లోతూ నీటిలో తిరుగుతూ ప్రజల బాధలను అడిగి తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు తిరిగి అవకాశమిస్తే ఎన్నికలు ముగిసిన తర్వాత డిసెంబర్ 7వ తేదీ నుంచి వరద సాయం రూ.10వేల పంపిణీని తిరిగి ప్రారంభిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఒరిస్సా, బీహార్, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో వరదలు వచ్చాయని, కానీ దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రూ.650 కోట్ల వరద సాయం అందించిందన్నారు. అంతకుముందు కేంద్రాన్ని రూ. 1350కోట్ల సాయం అడిగితే రూ.13పైసలు కూడా ఇవ్వలేదని సభ ద్వారా ప్రజలకు వివరించారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ కేసీఆర్ లాంటి బక్క మనిషిని కొట్టేందుకు కేంద్రం నుంచి నాయకులు వస్తున్నారని, హైదరాబాద్‌లో వరదలు వచ్చినపుడు ఎక్కడ పోయారని ప్రశ్నించారు. భవిష్యత్తులో హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మారుస్తామని, మెట్రోరైల్‌ను కూడా విస్తరిస్తామన్నారు.

దేశాన్ని నడపడంలో బీజేపీ ఘోరంగా విఫలమైందని కేసీఆర్ మండిపడ్డారు. లాభాల్లో నడిచే కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎల్ లైసీ, రైల్వేలను అమ్మేందుకు బీజేపీ చూస్తోందని ఫైర్ అయ్యారు.పక్క రాష్ట్రాల నుంచి నాయకులు వచ్చి ఇక్కడ కిరికిరిలు పెడతున్నారని, హైదరాబాద్ ఇప్పటిలాగే ప్రశాంతంగా మత, కుల సామరస్య పూర్వకంగా ఉండాలంటే ప్రజలు టీఆర్ఎస్ కు ఓటు వేసి గెలించాలని సీఎం కోరారు. మరోసారి మమ్మల్ని గెలిపిస్తే, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని కేసీఆర్ ప్రజలకు భరోసా కల్పించారు.


Next Story