‘‘కరోనాకంటే భయంకరమైనది కాంగ్రెస్’’

by Ramesh Goud |

<p>దిశ, న్యూస్ బ్యూరో: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనాకంటే భయంకరమైన వైరస్ కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. ఈ దేశానికి పట్టిన భయంకర కరోనాయే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై శనివారం అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారు. కరోనా అంశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని సీఎం ఆరోపిస్తూనే ఆ పార్టీపై రాజకీయ విమర్శలు చేశారు. కరోనా నివారణకు [&hellip;]</p>

‘‘కరోనాకంటే భయంకరమైనది కాంగ్రెస్’’
X

దిశ, న్యూస్ బ్యూరో: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనాకంటే భయంకరమైన వైరస్ కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. ఈ దేశానికి పట్టిన భయంకర కరోనాయే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై శనివారం అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారు. కరోనా అంశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని సీఎం ఆరోపిస్తూనే ఆ పార్టీపై రాజకీయ విమర్శలు చేశారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందనీ, అన్ని విషయాలనూ బయటకు చెప్తే ప్రజల్లో అప్రమత్తతకంటే భయం ఎక్కువవుతుందని, అందువల్లనే చాలా విషయాలు బహిర్గతం కాకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. తెలంగాణలోని వాతావరణ పరిస్థితుల్లో ఈ వైరస్ ఎక్కువగా మనగలిగే పరిస్థితి లేనప్పటికీ ప్రభుత్వం మాత్రం ఎక్కడా అలసత్వం చూపడంలేదని, కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడం మొదలు గాంధీ ఆస్పత్రిలో ఐసొలేషన్ వార్డులను ఏర్పాటుచేయడం, విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలను నెలకొల్పడం లాంటి చర్యలు తీసుకుందన్నారు.

కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కాంగ్రెస్ పార్టీ అవాకులు చెవాకులు పేలుతోందని, ప్రతి దాన్నీ రాజకీయ కోణం నుంచి చూడాలనుకుంటే అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని వారి కర్మకు వదిలేస్తున్నట్లు సీఎం వ్యాఖ్యానించడం అసెంబ్లీలో కొద్దిసేపు వాతావరణం వేడెక్కడానికి దారితీసింది. ఈ వైరస్ ప్రబలకుండా వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తం కావడంతో పాటు అన్ని శాఖల అధికారులతో ఉన్నత స్థాయి కమిటీ సమావేశాన్ని ఏర్పాటుచేసి ఇంకా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నామన్నారు. మరోవైపు కేబినెట్ సమావేశంలో సైతం దీనిపై లోతుగా చర్చించనున్నామని తెలిపారు. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కొరత లేదనీ, ప్రస్తుతానికి 1,000 కోట్ల రూపాయలు భరించడానికి సిద్ధంగా ఉందని, ఇంకా అవసరమైతే రూ.5,000 కోట్లకైనా వెనకాడేది లేదని సీఎం చెప్పారు.

భట్టితో వాగ్వాదం

కరోనాపై అసెంబ్లీలో జరుగుతున్న స్వల్పకాలిక చర్చ సందర్భంగా కాంగ్రెస్ శాసన సభ్యులు మల్లు భట్టి విక్రమార్క లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్ అయ్యారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న తరహా ప్రణాళికాబద్ధమైన చర్యలు తెలంగాణ ప్రభుత్వం కూడా చేపట్టి ఉంటే బాగుండేదన్నారు. చాలా రాష్ట్రాల్లో జనం గుమికూడే ప్రాంతాల్లో ఆంక్షలు అమలవుతున్నాయని, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని, తెలంగాణలో కూడా అలాంటి జాగ్రత్తలు అవసరమన్నారు. కరోనాకు భయపడాల్సిన పనిలేదనీ, కేవలం పారాసిటమాల్ మాత్రలను వేసుకుంటే సరిపోతుందంటూ స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా చెప్పారని భట్టి గుర్తుచేశారు. 27 లేదా 28 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆ వైరస్ బతకలేదంటూ చెప్పారనీ, కాని మానవ దేహంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని, అయినా వైరస్ బతికే ఉంటోందిగదా అని ప్రస్తావించారు.
ఈ కామెంట్‌తో కేసీఆర్ గుస్సా అయ్యారు. ఇప్పటికీ ఆ కామెంట్‌కు కట్టుబడే ఉన్నాననీ, తనకు ఓ శాస్త్రవేత్త ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారని కేసీఆర్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నింటినీ పక్కకు పెట్టి కేవలం ఈ ఒక్క అంశాన్నే తీసుకుని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, ఈ విషయంలో కూడా రాజకీయం తగదని అన్నారు. ఒకవేళ రాజకీయం చేయాలని అనుకుంటే అది వారి కర్మ అంటూ సీఎం వ్యంగాస్త్రాలు సంధించారు. ఈ కామెంట్‌కు భట్టి ఘాటుగానే స్పందించారు. భట్టివిక్రమార్క పేరును తాను ప్రస్తావించనే లేదని, అయినా ఆయన స్పందించడం గుమ్మడికాయ దొంగ సామెత తరహాలో ఉందన్నారు. వీరిద్దరి మధ్య మాటా పెరగడంతో అధికార పార్టీ సభ్యులంతా భట్టిపైకి విరుచుకుపడ్డారు. మాట్లాడే అవకాశం లేకుండా చేశారు. దానం నాగేందర్ అత్యుత్సాన్ని చూసి సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. చర్చ ముగింపు సందర్భంగా దేశానికి పట్టిన భయంకర కరోనా కాంగ్రెస్సేనని ఆయన ఆరోపించారు.

Tags: Telangana, Assembly, CM KCR, Congress, Corona, Bhatti Vikramarka

Next Story