- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గవర్నర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం
<p>దిశ, న్యూస్‌బ్యూరో: గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం రాజ్‌భవన్‌కు వెళ్లి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆరోగ్యంతో సంపూర్ణ జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య తెలంగాణ రాష్ట్ర అవతరణకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. భారత స్వాతంత్ర్యం తర్వాత సుదీర్ఘ కాలం జరిగిన ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని గవర్నర్ కొనియాడారు. రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారని సీఎం వివరించారు. అందుకే […]</p>

దిశ, న్యూస్‌బ్యూరో: గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం రాజ్‌భవన్‌కు వెళ్లి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆరోగ్యంతో సంపూర్ణ జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య తెలంగాణ రాష్ట్ర అవతరణకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. భారత స్వాతంత్ర్యం తర్వాత సుదీర్ఘ కాలం జరిగిన ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని గవర్నర్ కొనియాడారు. రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారని సీఎం వివరించారు. అందుకే అమరులకు నివాళ్లు అర్పించిన తర్వాతే పతాకావిష్కరణ చేస్తామన్నారు. సీఎం వెంట కేకే, కేఆర్ సురేష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, కార్పొరేషన్ చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.






