చనిపోయాక కూడా ఫ్రెండ్‌తో మీటింగ్?.. ఆసక్తి కలిగిస్తోన్న చెక్‌లిస్ట్

by  |
death checklist
X

దిశ, ఫీచర్స్: బతికున్నప్పుడు చేయాల్సిన పనుల గురించి ప్లాన్ చేసుకోవడం తెలిసిందే. కానీ, చనిపోయిన తర్వాత తన కోసం చేయాల్సిన పనులపై ఓ వ్యక్తి తయారు చేసుకున్న చెక్‌లిస్ట్ ఆసక్తిని కలిగిస్తోంది. సదరు వ్యక్తి తన బెస్ట్ ఫ్రెండ్‌కు పంపిన ఈ ఫొటో చెక్‌లిస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఆఫ్టర్ డెత్ చెక్‌లిస్ట్ ఫర్ బెస్ట్ ఫ్రెండ్’ టైటిల్ గల ఈ పిక్చర్‌లో తను చనిపోయాక చేయాల్సిన ఐదు పనులను బెస్ట్ ఫ్రెండ్‌కు సూచించాడు.

1. క్లియర్ మై బ్రౌజర్ హిస్టరీ
2. నేను శవపేటికలో ఉన్నానంటూ నా సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉండండి
3. సీక్రెట్ వర్డ్ గుర్తుంచుకో.. ఆత్మలు నిజమైతే అదే నా ఉనికిని తెలియజేస్తుంది
4. నేను ఇష్టపడని వ్యక్తి ఎవరో అతనికి చెప్పండి
5. నన్ను గుర్తుంచుకో

ఈ ఫొటో ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ కాగా.. నెటిజన్లు తమ బెస్ట్ ఫ్రెండ్స్‌కు ఈ పిక్‌ను ట్యాగ్ చేస్తున్నారు. కాగా, ఫేస్‌బుక్ యూజర్ ఒకరు.. తనకు, తన స్నేహితురాలికి మధ్య గల ‘సీక్రెట్ బెస్ట్ ఫ్రెండ్ వర్డ్’ గురించి చెప్పుకొచ్చింది. ‘నా ఫ్రెండ్ చనిపోయే ముందు సరిగ్గా ఇదే విషయం చెప్పింది. ఆమె చెప్పిన మాట ఎప్పుడైనా వినబడితే అది తనేనని నాకు తెలుసు. తనకు వాగ్ధానం చేసినట్లుగా నేను ఇంతవరకు ఒక్కరికి కూడా ఆ మాట చెప్పలేదు. అయితే అన్నింటి కన్నా మించి ఆమె నా చుట్టూ ఉందని తెలుసుకోవడానికి నాకు ఒక ప్రత్యేకమైన పదం అవసరం లేదు. ఎందుకంటే నేను తన గురించి ఆలోచిస్తున్న అన్ని సమయాల్లో నా చుట్టే ఉందని తెలుసు. మేము మా కమ్యూనికేషన్, ఆత్మ సంబంధాన్ని ఎన్నటికీ, ఎప్పటికీ ఆపం’ అని పోస్ట్ చేసింది.

Next Story