భద్రకాళి, వెయ్యి స్తంభాల గుడిలో సీజేఐ ప్రత్యేక పూజలు

by  |
CJI-1
X

దిశ ప్రతినిధి, వరంగల్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ దంపతులు హన్మకొండలోని భద్రకాళి అమ్మవారి ఆలయానికి ఉదయం 8 గంటలకు చేరుకున్నారు. ఆలయ పూజారులు ఘనంగా సీజే దంపతులకు స్వాగతం పలికారు. భద్రకాళి ప్రధాన అర్చకులు శేషు న్యాయమూర్తులకు తలపాగ చుట్టి, పూల మాలలు వేసి పూర్ణ కుంభంతో వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ఘనంగా ఆహ్వానం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి, ప్రసాదాలు అందజేశారు. దేవస్థానం ప్రాంగణంలో శాలువా, పట్టు వస్త్రాలు, లడ్డు ప్రసాదాలతోపాటు అమ్మవారి చిత్ర పటాన్ని వారికి బహుకరించారు. ఈ సందర్బంగా ఆలయ చరిత్ర, విశిష్టతను అర్చకులు వారికి వివరించారు.

అనంతరం అక్కడి నుండి నేరుగా వేయి స్తంభాల ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ పూర్ణ కుంభంతో వారికి స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ కార్యక్రమం అనంతరం తీర్ధ ప్రసాదాలను వారికి అందజేసి, శాలువా, పట్టు వస్త్రాలతో సత్కరించారు.



Next Story

Most Viewed