- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింహాచలంలో భయ్యా సన్నీ యాదవ్.. అన్వేష్ ఇంటికి వెళుతున్నట్లు పోస్ట్ !
యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ (Bayya Sunny Yadav ) గురించి కీలక అప్డేట్ వచ్చింది. మొన్నటి వరకు ఎన్ఐఏ (NIA) విచారణ

దిశ, వెబ్ డెస్క్: యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ (Bayya Sunny Yadav ) గురించి కీలక అప్డేట్ వచ్చింది. మొన్నటి వరకు ఎన్ఐఏ (NIA) విచారణ ఎదుర్కొన్న యూట్యూబర్స్ భయ్యా సన్నీ యాదవ్... మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా సింహాచలంలో ల్యాండ్ అయ్యాడు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్.
నేను ఏపీకి ( AP) వచ్చేసాను.. సింహాచలంలో ల్యాండ్ అయ్యాను.. ఇప్పుడు చూసుకుందాం రా... అంటూ అన్వేష్ ను ( Naa Anveshana) టార్గెట్ చేస్తూ సంచలన పోస్ట్ కూడా పెట్టాడు యూట్యూబ్ సన్నీ. అతి త్వరలోనే వైజాగ్ వెళుతున్నాను... మీ ఇంటికి కూడా వస్తానంటూ ఛాలెంజ్ విసిరాడు. మీ అమ్మ నాన్నకు కూడా ధైర్యంగా చెబుతానంటూ... సంచలన పోస్ట్ పెట్టాడు.
నువ్వు ఏమాత్రం టెన్షన్ పడకు అంటూ అన్వేష్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా విమానం ( Air India plane) ఎక్కిన వీడియోతో పాటు సింహాచలం లో ( Simhachalam) దిగిన విజువల్ షేర్ చేశాడు. కాగా ఇటీవల బైక్ పై పాకిస్తాన్ ( Pakisthan ) వెళ్లి వచ్చిన సన్నీ యాదవ్... అడ్డంగా బుక్కయ్యాడు. యుద్ధం సమయంలోనే అక్కడికి వెళ్లడంతో అతన్ని ఎన్ఐఏ అధికారులు విచారించి వదిలేశారు.
సింహాచలంలో యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్
— ChotaNews App (@ChotaNewsApp) June 17, 2025
నేనొచ్చేశానంటూ అన్వేష్ టార్గెట్గా పోస్టులు పెట్టిన సన్నీ.
వైజాగ్ వెళ్తున్నా, మీ ఇంటికెళ్తా.. మీ అమ్మానాన్నకి ధైర్యంగా చెబుతానంటూ అన్వేష్ని ఉద్దేశించి పోస్ట్.
నువ్వు టెన్షన్ పడకు అంటూ అన్వేష్కి సన్నీ కౌంటర్. ఇటీవలే బైక్పై పాకిస్థాన్… pic.twitter.com/DLpmyZdmvR






