- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shanmukh Jaswant: ‘ప్రేమకు నమస్కారం’ అంటున్న షణ్ముఖ్ జస్వంత్.. ఆసక్తికరంగా ట్వీట్
యూఇన్‌ఫ్లూయెన్సర్‌గా యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టించిన వారు ఇప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తూ.. సక్సెస్ అందుకుంటున్నారు.

దిశ, సినిమా: యూఇన్‌ఫ్లూయెన్సర్‌గా యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టించిన వారు ఇప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తూ.. సక్సెస్ అందుకుంటున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లో మరో ఇన్‌ఫ్లూయెన్సర్ జాయిన్ అయ్యాడు. యూబ్యూడ్ సన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్ హీరోగా ఓ కొత్త మూవీని ప్రకటించాడు. ఈ చిత్రానికి వి. భీమ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. ఏబీ సినిమాస్ పతాకంపై అనిల్ కుమార్ రవడ, భార్గవ్ మన్నె నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘ప్రేమకు నమస్కారం’ (premaku namaskaram) అనే టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీలో ఉల్క గుప్తా హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివాజీ, భూమిక కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు.
ఇక ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ విషయానికి వస్తే.. ఇదొక యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌లా కనిపిస్తుంది. లవ్ ఫెయిల్యూర్స్.. లవ్ బ్రేకప్ అయిన వాళ్లంతా ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటున్న సంభాషణలు, వాళ్ల గర్లఫ్రెండ్స్ తమకు ఎలా హ్యాండ్ ఇచ్చారు అని చెప్పుకునే ఫన్నీ బాధలు అన్ని ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. ఇక ఫైనల్‌గా ఫణ్ముఖ్ ఇది పాన్ ఇండియా ప్రేమ ప్రాబ్లమ్ అని చెప్పడం, మీరు అమ్మాయి దక్కలేదని మందుకు, సిగరెట్లకు ఖర్చు పెట్టే డబ్బులతో కైలాసగరి దగ్గర ల్యాండ్‌తో పాటు కారు కొనుక్కోవచ్చు అని చెప్పే సంభాషణలు నేటి యూత్‌కు, వాళ్ల ప్రేమకు ఎంతో కనెక్ట్ అవుతాయి. టోటల్‌గా ప్రేమకు నమస్కారం అనే టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో.. సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ యూత్‌ను ఆకట్టుకుంటుంది. లింక్






