- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మూవీ వాయిదా.. షాక్‌లో ఫ్యాన్స్.. ట్వీట్ వైరల్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘క’(Ka) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఆయన.. ప్రస్తుతం ‘దిల్ రూబా’(dilRuba) సినిమాలో నటిస్తున్నాడు. విశ్వకరుణ్(Vishwa Karun) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. శివమ్ సెల్యూలాయిడ్ ప్రొడక్షన్స్ అండ్ ప్రముఖ మ్యూజిక్ లేబల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలింతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో రుక్సర్ థిల్లాన్(Rukshar Thillon) హీరోయిన్‌గా నటిస్తోంది.
అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ కానున్నదని ఇది వరకే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు దిల్ రూబా మూవీ రిలీజ్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం దిల్ రూబా చిత్రాన్ని మార్చి 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాగా దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇక ఈ యంగ్ హీరో పర్సనల్ విషయానికి వస్తే.. హీరోయిన్ రహస్య గోరక్(Rahasya Gorak)ను గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం తన భార్య గర్భవతిగా ఉన్నది. ఈ విషయాన్ని స్వయంగా కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ భార్యతో దిగిన ఫొటోస్ షేర్ చేశాడు. దీంతో ఈ విషయం అందరికీ తెలిసింది.






