- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Abhinav Jeevinth : పెళ్లి చేసుకున్న యంగ్ అండ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్.. ఫొటోలు వైరల్ కావడంతో హర్ట్ అవుతున్న ఫ్యాన్స్
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో సంచలన విజయం సాధించాడు యంగ్ డైరెక్టర్ అభిషన్ జీవింత్.

దిశ, సినిమా: ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో సంచలన విజయం సాధించాడు యంగ్ డైరెక్టర్ అభిషన్ జీవింత్. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న ఈ డైరెక్టర్ తాజాగా పెళ్లి పీటలు ఎక్కాడు. తన గర్ల్ ఫ్రెండ్ అయిన అక్కిలాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన ప్రేమ విషయాన్ని బయట పెట్టిన అభిషన్.. ఆ స్టేజ్‌పైనే అక్టోబర్ 31న పెళ్లి చేసుకుంటాను అంటూ ప్రకటించాడు. ఇక చెప్పినట్టుగానే తన ప్రేయసి అక్కిలాను అక్టోబర్ 31న పెళ్లి చేసుకున్నాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతుండగా.. ఈ యంగ్ డైరెక్టర్ అప్పుడే పెళ్లి చేసుకోవడం ఏంటీ అంటూ లేడీ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. అలాగే కొందరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా.. ఈ డైరెక్టర్ హీరోగా ప్రయాణం స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. MRP ఎంటర్‌టైన్‌మెంట్ & జియాన్ ఫిలిమ్స్ బ్యానర్‌పై సౌందర్య రజినీకాంత్ నిర్మిస్తున్న ఈ మూవీకి మదన్ దర్శకత్వం వహిస్తుండగా.. అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తుంది. రీసెంట్‌గా ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా.. త్వరలో టైటిల్ అనౌన్స్‌మెంట్ చేయనున్నారు మేకర్స్. దీనికి సీన్ రోల్డాన్ సంగీతం అందిస్తున్నాడు. లింక్






