- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చీరలో చందమామలా యంగ్ బ్యూటీ.. కొంటె చూపులతో కొల్లగొట్టెస్తున్నావంటూ కామెంట్స్
అతిలోక సుందరి తనయురాలు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: అతిలోక సుందరి తనయురాలు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ భామ తెలుగులో కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) హీరోగా నటించిన ‘దేవర’(Devara) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తన ఫస్ట్ మూవీతోనే మంచి హిట్ సాధించింది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘పెద్ది’ మూవీలో నటిస్తుంది.
రామ్ చరణ్(Ram Charan) హీరోగా ‘ఉప్పెన’(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అలాగే బాలీవుడ్‌లో పరమ్ సుందరి మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఆగస్టు 29న ఈ చిత్రం రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.
తాజాగా జాన్వీ తన ఇన్‌స్టాలో కొన్ని శారీ ఫొటోస్ షేర్ చేసింది. మల్టీ కలర్ శారీ కట్టుకొని చేతితో పొద్దుతిరుగుడు పువ్వు పట్టుకొని క్యూట్ స్మైల్ ఇచ్చింది. వాలు కళ్లతో వయ్యారంగా చూస్తూ వావ్ అనిపించింది. ఇక వీటికి ‘సుందరి నీ అందంతో అందరినీ చంపేస్తున్నావు.. పరమ్ సుందరి మూవీ ఆగస్టు 29న థియేటర్లలో రాబోతుంది’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు కొంటె చూపులతో కొల్లగొట్టెస్తున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.






