‘అగధ’ చిత్రంలో మరో యంగ్ బ్యూటీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్

by Chukka Sudharani |

‘అగధ’ సినిమా నుంచి యంగ్ నటి ఉల్కా గుప్త ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

‘అగధ’ చిత్రంలో మరో యంగ్ బ్యూటీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్
X

దిశ, సినిమా: ఒక్కడు, వర్షం, మనసంతా నువ్వే వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను బాక్సాఫీస్‌కు అందించిన సీనియర్ మేకర్ ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘అగధ’. ఈ మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ చిత్రాన్ని శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతున్నది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర పనులలో బిజీగా ఈ మూవీకి సంబంధించిన వరుస అప్డేట్స్ ఇస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. దీంతో ఇందులో నటించే నటులకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను రిలీజ్ చేస్తూ మరింత హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.

ఈ మేరకు ఇప్పటికే రిలీజ్ చేసిన కామాక్షి భాస్కర్ల, బాలీవుడ్ నటుడు శ్రవణ్ రెడ్డి పోస్టర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో భాగంగా తాజాగా మరో యంగ్ బ్యూటీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘ఝాన్సీ రాణి లక్ష్మీబాయి’ సీరియల్‌తో బుల్లితెరపై తన మార్క్‌ను సెట్ చేసుకున్న యంగ్ బ్యూటీ ఉల్కా గుప్తా ఇప్పటికే ‘ది కేరళ స్టోరీ 2’ తో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ‘అగధ’తో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నది. ఇందులో ‘మహిమ’ అనే పాత్రలో ఈ యంగ్ బ్యూటీ కనిపించనున్నట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Next Story