- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెయిడ్ పీఆర్ మాఫియా.. ఇండస్ట్రీలో దోపిడీపై హీరోయిన్ పోస్ట్
హీరోయిన్ యామీ గౌతమ్ రీసెంట్‌గా ‘హక్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. త్వరలో ఆమె భర్త ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘దురంధర్’ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కానీ రిలీజ్‌కు సిద్ధమైన ఈ మూవీ గురించి నెగెటివ్‌గా ప్రచారం

దిశ, సినిమా : హీరోయిన్ యామీ గౌతమ్ రీసెంట్‌గా ‘హక్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. త్వరలో ఆమె భర్త ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘దురంధర్’ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కానీ రిలీజ్‌కు సిద్ధమైన ఈ మూవీ గురించి నెగెటివ్‌గా ప్రచారం చేయడాన్ని తప్పు పట్టింది. దేశాన్ని గర్వపడేలా చేసే ప్రాజెక్ట్‌ను తొక్కేస్తున్నారని.. బాలీవుడ్ మార్కెటింగ్ వ్యవస్థలో జరుగుతున్న దోపిడీ గురించి బహిరంగంగా చర్చించింది. పెయిడ్ పీఆర్ మాఫియా ఎక్స్‌టార్షన్‌ను ఆరికట్టాలని కోరింది.
కొన్ని మీడియా హౌసులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు సినిమాలకు పాజిటివ్ హైప్ ఇవ్వాలంటే డబ్బు డిమాండ్ చేస్తున్నారని.. ఇవ్వకపోతే నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తామని బెదిరిస్తున్నారని పోస్టులో తెలిపింది. ఈ పద్ధతి నిజాయితీని చంపేస్తుందని.. సాధారణ ప్రమోషన్‌గా దీన్ని నార్మలైజ్ చేయొద్దని కోరింది. సౌత్ ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయని.. అక్కడ అందరూ కలిసి ఉంటారని ప్రస్తావించింది. ఈ కీటక సంస్కృతిని అందరూ కలిసి అరికట్టాలని.. నిర్మాతలు, దర్శకులు, నటీనటులను కోరింది.






