- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Alia bhatt: వావ్.. ఆలియా భట్ కేన్స్ లుక్ చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో కదా!
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్యాషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Canes film festival).. ట్రెండీ ఫ్యాషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిస్తోంది. ఇందులో పాల్గొనే ముద్దుగుమ్మలంతా విభిన్న స్టైలిష్ దుస్తులు ధరించేందుకు పోటీ పడుతుంటారు. ఇక సినీ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ వేడుక పారిస్‌లో (Paris) అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 24వ తేదీ వరకు సాగనున్నాయి. ఈ సందర్భంగా హాలీవుడ్, బాలీవుడ్ అందాల భామలు రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. భారతీయ సినీ ప్రముఖులు ఐశ్వర్యరాయ్, ఊర్వశీ రౌతేలా, జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్, కరణ్ జోహార్ తదితరులు హాజరై ప్రత్యేక ఆకర్శణగా నిలచారు. ఇక తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కూడా కేన్స్ వేడుకల్లో మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఆలియా భట్ తొలిసారిగా కేన్స్ వేడుకల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె రెడ్ కార్పెట్‌పై సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన ఫ్లోరల్ గౌన్‌తో నాజూగ్గా కనిపించారు. అంతకంటే ముందు తన లుక్ ఫొటోలను ఇన్‌స్టాలో ఆలియా షేర్ చేశారు. 'హలో కేన్స్' అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'ఆలియా భట్ ఓహ్ మై డిస్నీ ప్రిన్సెస్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆలియా L'Oréal Paris బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు.






