- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IBOMMA రవికి రేపు బెయిల్ వస్తుందా?
పైరసీ సినిమాల కేసులో అరెస్ట్ అయిన ఇమంది రవి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. రేపు రవి బెయిల్ పిటిషన్ పైనా విచారణ జరగనుంది. దీంతో రవిని కోర్టు కస్టడీకి అప్పగిస్తుందా? లేదంటే బెయిల్ మంజూరు చేస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్: పైరసీ సినిమాల కేసులో అరెస్ట్ అయిన ఇమంది రవి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. రవిని అరెస్ట్ చేసిన తవరాత పోలీసులు కస్టడీ విచారణలోకి తీసుకున్నారు. ఎనిమిది రోజుల విచారణలో ఐబొమ్మకు సంబంధించి పలు కీలక ఆధారాలను సైబర్ క్రైమ్ పోలీసులు రాబట్టారు. రవిపై పైరసీతో పాటు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ సహా పలు కేసులు బుక్ చేశారు. కాగా రేపు మరో మూడు కేసుల్లో రవిని పోలీసులు కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
ఈ మూడు కేసుల్లో సైతం రవిని కస్టడీకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు రేపు రవి బెయిల్ పిటిషన్ పైనా విచారణ జరగనుంది. దీంతో రవిని కోర్టు కస్టడీకి అప్పగిస్తుందా? లేదంటే బెయిల్ మంజూరు చేస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే రవి ఐబొమ్మ వెబ్ సైట్ ద్వారా సినిమాలను పైరసీ చేస్తూ వందల కోట్లు సంపాదించినట్టు పోలీసుల విచారణలో తేలింది. రవి విచారణకు సహకరించడంలేదని కూడా పోలీసులు చెబుతున్నారు.






