2025లో స్టార్ హీరోలకు గట్టి షాక్.. చతికిలబడిన భారీ సినిమాలు

by Naga Rani Yarlagadda |

2025లో బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ డీలా పడింది. స్టార్ హీరో సినిమాలు సైతం..

2025లో స్టార్ హీరోలకు గట్టి షాక్.. చతికిలబడిన భారీ సినిమాలు
X

దిశ, వెబ్‌డెస్క్: 2025లో బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ డీలా పడింది. స్టార్ హీరో సినిమాలు సైతం ప్రమోషన్లు లేకుండా ఆడలేదు. ఒక పెద్దహీరో సినిమా.. ప్రమోషన్లు, ప్రీ రిలీజ్ కంటెంట్, హీరో ట్రాక్ రికార్డు, డైరక్షన్లో చెప్పడంతో .. ఓ రేంజ్ లో ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపేందుకు కష్టపడినట్లు తెలిపారు. ఒకప్పుడు స్టార్ హీరోకు ఉన్న రేంజ్ ఇప్పుడు లేదు. ఇప్పుడున్న రేంజ్ తో హీరోలు హిట్ కొట్టడం చాలా కష్టం. 2025లో స్టార్ హీరోల సినిమాలు సరైన ఓపెనింగ్స్ తెచ్చుకోవడంలో ఫెయిల్ అయ్యాయి. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, వార్ -2, హరిహర వీరమల్లు, ఓజీ.. ఇలా అనేక ప్రెస్టేజియస్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి.

కటౌట్ ఉంటే సరిపోదు కంటెంట్ ఉండాలన్న విషయం ఇప్పుడే తెలిపింది. ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రానికి చెందిన హీరో అయినా.. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న హీరోలైనా సరే.. ఓటమి ఎదురైతే అది కెరీర్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు సినిమా లేకపోతే.. తొలిరోజే తేడా కొట్టేస్తుంది. కేవలం ఫ్యాన్స్ కోసం సినిమాలు తీస్తే సరిపోదు. న్యూట్రల్ ఆడియన్స్ కూడా థియేటర్ కు రావాలి. దీనిని అర్థం చేసుకోవాలంటే పవన్ సినిమాలే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన నటించిన ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూల్లు రాబట్టింది. రూ.140 కోట్ల గ్రాస్ రాబట్టి.. రికార్డులు తిరగరాసింది. కానీ.. అంతకుముందు వచ్చిన హరిహర వీరమల్లుకు మాత్రం సగం ఓపెనింగ్స్ కూడా రాలేదు. హీరో ఒక్కడే అయినా ఎందుకీ తేడా అంటే.. ప్రేక్షకులకు స్టోరీ నచ్చకపోవడం. సో సినిమా రిలీజ్ కు ముందు దానిపై బజ్ క్రియేట్ చేయడంలో కంటెంట్ దే మెయిన్ రోల్ అన్నవిషయాన్ని దర్శక నిర్మాతలు గుర్తుంచుకోవాలి. లేదంటే నిండా మునిగిపోవడం ఖాయం.

Next Story