ఈలలు.. కేకలతో కాదు కంటెంట్‌తోనే హిట్... అడవి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Pulgam srinivas |

శేష్ మాట్లాడుతూ: ఒక సినిమా మంచి వసూళ్లను సాధించాలంటే హీరోకు ఉన్న క్రేజ్ కంటే సినిమాలోని కంటెంట్‌ ముఖ్యమని ఈ నటుడు వ్యాఖ్యానించాడు.

ఈలలు.. కేకలతో కాదు కంటెంట్‌తోనే హిట్... అడవి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న వారిలో అడవి శేష్ ఒకరు. ఈయన హీరోగా నటించిన దాదాపు అన్ని చిత్రాలతో విజయాలను అందుకున్నాడు. తాజాగా ఈ నటుడు డెకాయిట్ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ మూవీ రేపు విడుదల కానుంది. దాంతో పెద్ద ఎత్తున ఈ నటుడు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. ఆ ప్రమోషన్లలో భాగంగా ఈయనకు ఓ కాలేజీ ఈవెంట్‌లో ఎదురైన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. శేష్ మాట్లాడుతూ… కొన్ని సంవత్సరాల క్రితం ఓ కాలేజీ ఈవెంట్‌కు మరో ఇద్దరు హీరోలతో కలిసి నేను వెళ్లాను. ఆ సమయంలో నాతో పాటు ఉన్న మరో ఇద్దరు హీరోల పేర్లు చెప్పినప్పుడు అక్కడున్న జనాలు పెద్ద ఎత్తున అరుస్తూ, గోల చేస్తూ, విజిల్స్ వేస్తున్నారు.

ఆ ఇద్దరితో పోలిస్తే నాకు జనాల నుండి స్పందన చాలా తక్కువగా వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికే ఆ హీరోలు నటించిన సినిమాలు విడుదలయ్యాయి. అయితే వారి చిత్రాలకు పెద్దగా కలెక్షన్లు రాలేదు. అదే సమయంలో నా సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఒక సినిమా హిట్ కావాలి అంటే ఆ హీరోకు ఉన్న క్రేజ్ కంటే అందులో ఉన్న కంటెంట్ చాలా ముఖ్యం. విజిల్స్, అరుపులు, కేకలు ఇవన్నీ సినిమా హిట్ కావడానికి, టికెట్లు తెగడానికి పెద్దగా సహాయపడవు. సినిమాలో మంచి కంటెంట్ ఉన్నట్లయితేనే ఆ చిత్రాలను ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తారని ఈ యువ నటుడు తాజాగా చెప్పుకొచ్చాడు.

Next Story