మా అమ్మను చూస్తే రోహిణి మేడం గుర్తుకు వస్తారు.. నేచురల్ స్టార్ ఎమోషనల్ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2025-03-16 11:23:36  IST  )

నేచురల్ స్టార్ నాని(Nani) సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్ పై ప్రశాంతి(Prashanthi) నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘కోర్టు’(Court). ఈ సినిమాలో ప్రియదర్శి(Priyadarshi) ప్రధాన పాత్రలో నటించగా.. యంగ్ డైరెక్టర్ రామ్ జగదీశ్(Ram Jagadeesh) తెరకెక్కించారు.

మా అమ్మను చూస్తే రోహిణి మేడం గుర్తుకు వస్తారు.. నేచురల్ స్టార్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని(Nani) సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్ పై ప్రశాంతి(Prashanthi) నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘కోర్టు’(Court). ఈ సినిమాలో ప్రియదర్శి(Priyadarshi) ప్రధాన పాత్రలో నటించగా.. యంగ్ డైరెక్టర్ రామ్ జగదీశ్(Ram Jagadeesh) తెరకెక్కించారు. ఇక ఈ చిత్రంలో శివాజీ(Shivaji), సాయి కుమార్(Sai Kumar), రోహిణి(Rohini), హర్ష వర్థన్(Harsha Vardhan), శ్రీదేవి(Sridevi) వంటి నటులు కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సినిమా మార్చి 14న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయి ఫస్ట్ డేనే రూ.8 కోట్ల వసూళ్లను రాబట్టింది.

ఇక ఆ మూవీ మంచి టాక్‌తో దూసుకోవడంతో తాజాగా మూవీటీమ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఇందులో భాగంగా నాని.. అలనాటి నటి రోహిణి పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నాకు సినిమా వరల్డ్‌లోనే ఎంతో ఇష్టమైన వారెవరంటే అది రోహిణి మ్యామ్ మై అమ్మ. నాకు మా అమ్మను చూస్తే రోహిణి మేడం గుర్తుకు వస్తారు.. రోహిణి మేడమ్‌ను చూస్తే మా అమ్మ గుర్తుకు వస్తుంది. ఆమె సెట్లో కానీ, సినిమాలో కానీ ఎక్కడైన ఉందని తెలిస్తే నా పని అయిపోయిందని పిస్తుంది.

అంటే నా సినిమా పెద్ద హిట్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మణిరత్నం(Maniratnam) గారి గ్రేటెస్ట్ ఫ్యాన్‌ను కదా అయితే ఆ సినిమాలోని హీరోయిన్లందరికీ డబ్బింగ్ చెప్పింది మన రోహిణి మేడమే. అందుకే అనుకుంటా మాకు ఫస్ట్ నుంచి ఏదో మంచి కనెక్షన్ ఉంది’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాని చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా తెలుగు సినిమాల్లో అమ్మ పాత్రలంటే ఠక్కున గుర్తొచ్చేది రోహిణియే. నాని హీరోగా నటించిన ‘అలా మొద‌లైంది’(Ala Modalaindhi) సినిమాతో కెరీర్ సెకెండ్ ఇన్నింగ్స్‌ను అమ్మ పాత్రతో స్టార్ట్ చేసిన రోహిణి ఇప్పటికీ అమ్మ పాత్రలను చేస్తునే ఉన్నారు. ఎంతో నేచురల్‌గా అనిపించే తన నటనతో ఆమె ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఆమె కేవలం నటిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా ఎంతో ప్రతిభ చూపుతుంటారు.

Next Story