- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్నప్ప మూవీ చూసిన మంచు మనోజ్.. ఏం చెప్పాడంటే?
ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఇవాళ (జూన్ 27) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఇవాళ (జూన్ 27) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ బడా స్టార్ అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వంటి భారీ తారాగణం నటించటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుకున్నట్లుగానే ఈ చిత్రానికి ప్రస్తుతం పాజిటివ్ రివ్యూస్ దక్కుతుండడం విశేషం. ఇక ఈ సినిమాపై తాజాగా మంచు మనోజ్ (Manchu manoj) స్పందించారు. ఉదయం హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో సినిమా చూసిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.
కన్నప్ప సినిమా చాలా బాగుందని చెప్పారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. 'చివరి 20 నిమిషాలు చూడగానే గూస్‌బంప్స్ వచ్చాయి. కథనం అద్భుతంగా మలిచారు. విజువల్స్, విజువల్ ఎఫెక్ట్స్ బావున్నాయి. మా నాన్నగారు (మోహన్‌బాబు) చేసిన నటన చూస్తే.. ఆయన కొడుకుగా గర్వంగా ఉంది. ఆయన పాత్రలో పూర్తిగా జీవించారు. ఆయన డైలాగ్ డెలివరీ, భావప్రకటన విన్నవారిని కదిలించేలా ఉన్నాయి. ప్రభాస్ యాక్టింగ్ అదిరింది. అన్న ఇంత బాగా చేస్తారని అస్సలు ఊహించలేదు. ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవాలని ప్రార్థిస్తున్నా' అని మనోజ్ తెలిపారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు తనను భావోద్వేగానికి గురిచేశాయన్నారు.
కాగా, గత కొన్ని రోజులుగా మంచు అన్నదమ్ముల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మంచు మనోజ్ తన అన్న మంచు విష్ణుపై సెటైరికల్ కామెంట్లు చేయడం, ఇటు విష్ణు కూడా మనోజ్‌పై విమర్శలు గుప్పించడం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






