Urvashi Rautela: కావాలనే బాత్రూం వీడియో లీక్ చేశామంటూ షాకిచ్చిన బాలయ్య బ్యూటీ

by Hamsa |   ( Updated:2025-01-22 08:39:13.0  )
Urvashi Rautela: కావాలనే  బాత్రూం వీడియో లీక్ చేశామంటూ షాకిచ్చిన బాలయ్య బ్యూటీ
X

దిశ, సినిమా: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా(Urvashi Rautela) ఐటమ్ సాంగ్స్‌లో ఆడిపాడి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇటీవల ఈ అమ్మడు నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna) ‘డాకు మహారాజ్’(Daaku Maharaj) చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసి తన డ్యాన్స్‌తో ఆశ్చర్యపరిచింది. అయితే బాబీ కొల్లి(Bobby Kolli ) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాన్ని సాధించింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ థియేటర్స్‌లో రాణిస్తుంది.

దీంతో ఊర్వశి వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఊర్వశి గతంలో తన బాత్రూం వీడియో లీక్ అవడంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘అది నా ప్రైవేట్ వీడియో కాదు. ‘ఘుస్పైథియా’(Ghuspaithia) సినిమాలోని సీన్. అది మాత్రమే లీక్ చేయడానికి కారణం ఉంది. ఆ మూవీ మేకర్స్ నా దగ్గరకు వచ్చి ఏడ్చారు. ఆస్తులన్నీ అమ్మి మరీ సినిమా తీశాము. కొన్ని కారణాల వల్ల రిలీజ్ చేయలేకపోయామని బాధపడ్డారు. బాత్ రూమ్ వీడియో లీక్ చేస్తే బజ్ వస్తుందని రిక్వెస్ట్ చేశారు.

అలాగే అమ్మాయిలకు కూడా అవగాహన కలిగించినట్లు అవుతుందని కూడా చెప్పారు. దీంతో నాకూడా బాగానే అనిపించింది. వాళ్ల కోరిక మేరకు వీడియోను లీక్ చేశాను. ఇదంతా మేకర్స్ అనుమతితోనే జరిగింది. ఆ బాత్రూమ్ సీన్ చూసి అమ్మాయిలు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటారని ఉద్దేశంతో అలా చేశాం. అలాగే మేకర్సు కూడా అప్పుల బాధ నుంచి బయటపడతారు కదా అని ఆలోచించి అలా చేశాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఊర్వశి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకుని కొందరు షాక్ అవుతున్నారు.

Advertisement

Next Story