వండర్ ఫుల్ విజువల్స్‌తో ‘వృష‌భ‌’ .. 45 నిమిషాల ఫుటేజీపై చర్చ

by Sujitha Rachapalli |

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న ప్రెస్జీజియస్ మూవీ ‘వృష‌భ‌’. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఈ నెల 25న గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ గ్రాండ్ రిలీజ్ చేస్తుంది. కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్,

వండర్ ఫుల్ విజువల్స్‌తో ‘వృష‌భ‌’ .. 45 నిమిషాల ఫుటేజీపై చర్చ
X

దిశ, సినిమా : మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న ప్రెస్జీజియస్ మూవీ ‘వృష‌భ‌’. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఈ నెల 25న గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ గ్రాండ్ రిలీజ్ చేస్తుంది. కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మించారు. విమ‌ల్ ల‌హోటి స‌హ నిర్మాత‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నంద కిషోర్ మ‌ల‌యాళం, తెలుగులో రూపొందించారు. విడుదల దగ్గర పడుతుండటంతో ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి హీరో సమర్జీత్ లంకేష్, హీరోయిన్ నయన్ సారిక, నటులు ఆలీ, బలగం సంజయ్, ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన బన్నీ వాస్.. ‘భారీ బడ్జెట్ ఖర్చు పెట్టి ‘వృష‌భ‌’ను నిర్మించారు. ఈ సినిమా విజువల్స్ గ్రాండ్‌గా ఉంటాయి. కింగ్ ఎపిసోడ్ వచ్చినప్పటి నుంచి సినిమా మరో స్థాయికి వెళ్తుంది. ఫైట్స్, ఎమోషనల్ కంటెంట్ కూడా బాగుంటుంది. సామ్ సీఎస్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేను దాదాపు 45 నిమిషాల పుటేజ్ చూశాను. సమర్జిత్‌లో ఈజ్ ఉంది. అతను కన్నడలో పెద్ద స్టార్ అవుతాడు. నయన్ ‘ఆయ్’, ‘క’ సినిమాల తర్వాత ‘వృషభ’తో హ్యాట్రిక్ అందుకోవాలి. మోహన్ లాల్ గారు అంటే మనందరికీ గౌరవం. ఆయన ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాం’ అని తెలిపాడు.




Next Story