- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళ హిట్ డైరెక్టర్‌తో విశ్వక్ సేన్ కొత్త ప్రాజెక్ట్.. నేడు ఘనంగా స్టార్ట్
తాజాగా పూజాకార్యక్రమాలతో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కొత్త సినిమా స్టార్ట్ అయింది.

దిశ, సినిమా: వరుస పరాజయాలు చవి చూస్తున్నా మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ‘ఫంకీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేక పోయాడు. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య థియేటర్స్‌లోకి వచ్చి కేవలం మిక్సిడ్ టాక్ మాత్రమే సొంతం చేసుకుంది. దీంతో తదుపరి ప్రాజెక్టులపై విశ్వక్ మరింత ఫోకస్ పెట్టాడు. ఇందులో భాగంగానే తమిళ దర్శకుడితో చేతులు కలిపాడు. తమిళ స్టార్ కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘దేవ్’ చిత్రంతో హిట్ అందుకున్న దర్శకుడు రజత్ రవిశంకర్.
ఈ సినిమా 2019లో విడుదల కాగా.. దాదాపు 7ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు విశ్వక్ చిత్రానికి ఈ దర్శకుడు దర్శకత్వం వహిస్తుండగా.. అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. యువ సుధ ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్-3గా తెరకెక్కుతోన్న ఈ మూవీని సుధాకర్ మిక్కినేని నిర్మిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ అండ్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీ శ్రేయోభిలాషుల సమక్షంలో తాజాగా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. మూహూర్తపు సన్నివేశానికి బ్లాక్‌బస్టర్ దర్శకుడు కొరటాల శివ క్లాప్ కొట్టగా, శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా ఆన్ చేసి స్క్రిప్ట్‌ను అందించారు. విశ్వక్ సేన్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో రానున్నాయి.






