- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vishnu Vinyasam : మొదటి రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?
Vishnu Vinyasam : శ్రీ విష్ణు హీరోగా రూపొందిన ఈ సినిమాకి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.95 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీ విష్ణు తాజాగా విష్ణు విన్యాసం అనే మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో నయన్ సారిక హీరోయిన్గా నటించింది. శ్రీ విష్ణు హీరోగా రూపొందిన ఎన్నో కామెడీ చిత్రాలు మంచి విజయాలను అందుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు ఉండడం, అలాగే శ్రీ విష్ణు కూడా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని గట్టి నమ్మకంతో చెప్పడంతో మరోసారి ఈ నటుడు థియేటర్లలో కడుపుబ్బ నవ్విస్తాడని చాలామంది భావించారు. కానీ అలా ఆశించిన వారికి ఈ హీరో నిరాశనే మిగిల్చాడు. ఈ మూవీకి నెగటివ్ టాక్ వచ్చింది. దాంతో పెద్దగా ఓపెనింగ్స్ కూడా రాలేదు.
తాజాగా విష్ణు విన్యాసం యూనిట్ ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 3.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి చాలా పెద్ద మొత్తంలో బిజినెస్ జరిగింది. మరి నెగటివ్ టాక్ వచ్చిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకోవడం కష్టమని చాలామంది అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సుమంత్ నాయుడు జి నిర్మించారు. రధన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించాడు.






