- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Vayyari : జూనియర్ నుంచి వైరల్ వయ్యారి సాంగ్.. కెమిస్ట్రీతో కట్టిపడేస్తున్న శ్రీలీల, కిరీటి
మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి తనయుడు కిరీటిరెడ్డి (Kiriti Reddy), బ్యూటీఫుల్ బ్యూటీ శ్రీలీల (Sree leela) కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ లవ్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనింగ్ మూవీ ‘జూనియర్

దిశ, సినిమా: మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి తనయుడు కిరీటిరెడ్డి (Kiriti Reddy), బ్యూటీఫుల్ బ్యూటీ శ్రీలీల (Sree leela) కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ లవ్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనింగ్ మూవీ ‘జూనియర్’ (Junior). దీనికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. వరాహి చలనచిత్ర బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో ఎవర్ గ్రీన్ బ్యూటీ జెనీలీయా (Genelia) చాలా కాలం తర్వాత టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తుంది.
ఈ సినిమా జూలై 18న తెలుగు, కన్నడ, హిందీ, తమిళం అండ్ మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. రిలీజ్ సమయం దగ్గర పడుతున్న క్రమంలోనే తాజాగా ఈ మూవీ నుంచి ‘వైరల్ వయ్యారి’ (Viral Vayyari) సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘వై వై వైరల్.. వై వై వయ్యారి’ అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్‌ను కల్యాణ్ చక్రవర్తి రాయగా.. హరిప్రియ, దేవిశ్రీ ప్రసాద్ పాడారు. ప్రజెంట్ ఈ సాంగ్ ఊరమాస్ స్టెప్పులతో నెట్టింట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.






