- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Varanasi: "వారణాసి" కోసం భారీ హోర్డింగ్..రిలీజ్ అనౌన్స్ చేస్తూ!
ప్రిన్స్ మహేష్ బాబు, జక్కన్న దర్శకత్వంలో వస్తున్న వారణాసి ( VARANASI ) సినిమా 2027 ఆగస్టు 9వ తేదీన విడుదల కాబోతున్నట్లు న్యూస్ వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి ( VARANASI Movie). భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా సాగుతోంది. ఈ సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు ( Mahesh Babu) హీరోగా నటిస్తుండగా, ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా మెరువనున్నారు. అంతేకాదు మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపిస్తుండగా, ప్రియాంక మందాకినిగా మెరువనున్నారట. అటు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీత స్వరాలు అందిస్తున్న ఈ సినిమా బడ్జెట్ 1300 కోట్ల రూపాయల వరకు ఉంటుందట.
వారణాసి పేరుతో భారీ హోర్డింగ్
ప్రిన్స్ మహేష్ బాబు, జక్కన్న దర్శకత్వంలో వస్తున్న వారణాసి ( VARANASI ) సినిమా 2027 ఆగస్టు 9వ తేదీన విడుదల కాబోతున్నట్లు న్యూస్ వైరల్ గా మారింది. శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేశాడట. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. ఇప్పుడు కొత్త తేదీని వైరల్ చేస్తున్నారు. వారణాసి సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీన రిలీజ్ కాబోతున్నట్లు పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు అభిమానులు. అది కూడా వారణాసిలోని మైదగిన్ ( Maidagin) అనే ప్రాంతంలో ఈ హోల్డింగ్స్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇది చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.






